81) కింది ఏ పరిస్థితులలో కో-వారెంట్ రిట్ జారీ చేయబడుతుంది ?
ఎ. కార్యాలయం ప్రభుత్వండై ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి
బి. కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్చ మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యదార్థమైనదై ఉండాలి
సి. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ మరియు బి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) బి మరియు సి మాత్రమే
82) మూడు సంవత్సరాల క్రితం కింది వాటిలోని ఏ దేశంలో అమెరికా దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది ?
A) ఇరాన్
B) క్యూబా
C) పాకిస్తాన్
D) ఇరాక్
83) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. రాష్ట్ర పరిధి దాటి గవర్నర్ చేసే అధికార పర్యటనల గురించి భారత గృహ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది
బి. ఇప్పుడు గవర్నర్లు పర్యటనల విషయమై రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి మరియు పర్యటనలు ఒక సంవత్సరంలో 73 రోజుల కన్నా మించకూడదు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది
84) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకతా సమీపంలో కేంద్రీకృతమై ఉండినవి
బి. నీలం మందు కర్మాగారాలను బ్రిటీష్ ప్రభుత్వం అస్సాంలో స్థాపించింది
సి. 1860లో కాన్పూర్ లో ప్రభుత్వ చర్మ కర్మాగారం స్థాపించబడింది
డి. 1907లో, ఇనుము-ఉక్కు పరిశ్రమ సాక్చిలో స్థాపించబడింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు డి మాత్రమే
B) ఎ, సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే
85) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. గాయిటర్ | 1. విటమిన్-ఎ |
బి. హీమోఫిలియా | 2. కళ్లు పచ్చబడుట |
సి. జాండీస్ | 3. విటమిన్-3 |
డి. రే చీకటి | 4. అయోడిన్ లోపం |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-3, బి-4, సి-2, డి-1
B) ఎ-4, బి-3, సి-2, డి-1
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-4, బి-3, సి-1, డి-2