86) కింది వాటిని జతపరచండి :
సంఘటన | తేదీ |
ఎ. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క ఆమరణ నిరాహార దీక్ష | 1. 10.1.1969 |
బి. పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క ఆమరణ నిరాహార దీక్ | 2. 8.1.1969 |
సి. హైదరాబాద్ రెడ్డి హాస్టల్ లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ లో | 3. 25.3.1969 |
డి. తెలంగాణ ప్రజాసమితి యొక్క ఆవిర్భావం | 4. 8.3.1969 |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-1, బి-2, సి-3, డి-4
B) ఎ-2, బి-1, సి-3, డి-4
C) ఎ-2, బి-1, సి-4, డి-3
D) ఎ-3, బి-4, సి-1, డి-2
87) భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు ?
A) లార్డ్ బెంటింక్
B) లార్డ్ వెల్లెస్లీ
C) లార్డ్ డల్ హౌసి
D) లార్డ్ రిప్పన్
88) ‘ప్రపంచ జల దినోత్సవం’కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు ‘ప్రపంచ జల దినోత్సవంను జరుపుతారు
బి. 2018వ సంవత్సరపు దాని నేపథ్యం (థీం) ‘అందరికీ సురక్షితమైన నీరు’
సి. 1993లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22ను ‘ప్రపంచ జల దినోత్సవం’గా ప్రకటించింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే
89) డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిటీ పై కింది వివరణలను పరిశీలించండి :
ఎ. 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మం త్రిత్వ శాఖ డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిటీని నియమించింది
బి. ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది
సి. బి.పి.ఎల్. జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్ గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి ఉండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది
డి. బి.పి.ఎల్ జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్ గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ‘ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాల’ను ఆటోమేటిక్ గా చేర్చుకోవాలి
సరైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే
90) తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కింది జతలను పరిశీలించండి :
ఎ. టి-హెచ్ఎ’ (T-HART): తెలంగాణ తోటల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు శిక్షణ
బి. టి-అసిస్ట్ ‘ (T-ASSIST): చిన్నతరహా పరిశ్రమల నైపుణ్యాల టెక్నాలజీ వేగవంతం చేయటం
సి. టి-అసిస్ట్ (T-ASSIST): తెలంగాణ అడ్వా న్స్డ్ సాలిడ్ స్టేట్ ఇల్యూమినేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్
డి. రిచ్ (RICH): హైదరాబాద్ పరిశోధన మరియు ఆవిష్కరణ సర్కిల్
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) బి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) ఎ, సి మరియు డి మాత్రమే