91) కింది వాటిని జతపరచండి :
రకం | విపత్తు |
ఎ. భూగర్భ విపత్తు | 1. రసాయనిక, అణు |
బి. వాతావరణ విపత్తు | 2. భూకంపం, సునామీ |
సి. జీవపరమైన విపత్తు | 3. తుఫాను, కరువు |
డి. పారిశ్రామిక విపత్తు | 4. అగ్నిప్రమాదం, బాంబు పేలుడు |
5. అంటువ్యాధులు, విష ఆహారం |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-2, బి-3, సి-5, డి-1
B) ఎ-3, బి-4, సి-2, డి-1
C) ఎ-2, బి-5, సి-3, డి-4
D) ఎ-3, బి-2, సి-3, డి-4
92) 2017 సంవత్సరానికి గానూ “సాహిత్య అకాడమీ యువ పురస్కార్”ను పొందిన మెర్సీ మార్గరెట్ ఏ భాషలో రచించిన తన కవిత్వానికి పొందారు ?
A) ఇంగ్లీష్
B) తెలుగు
C) కొంకణ్
D) తమిళ్
93) అఖిల భారత మహిళా సమావేశం. (AIWC) , గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ఈ కాన్ఫరెన్స్ పూనాలో జనవరి 1927లో ఆవిర్భవించింది
బి. కలకత్తాలోని బెథుని కాలేజీ (Bethune College) లో పాఠాలు చెప్పే ఎ.ఎల్.హ్యుడెకోపర్ దీనిని స్థాపించారు
సి. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడటానికి ఇది కృషి చేస్తుంది
డి. 1932లో మహిళల కోసం హోమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజి అనే మహిళా కాలేజిని ఈ సంస్థ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి మరియు డి మాత్రమే
94) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. భారతదేశ పరిధిలోని వాణిజ్య బ్యాంకుల నుండి భారతీయ రిజర్వు బ్యాంక్ తీసుకునే అప్పుపై చెల్లించే రేటును రెపో రేటు’, అంటారు
బి. వాణిజ్య బ్యాంకులకు ఏమైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటును ‘రివర్స్ రెపో రేటు’ అంటారు.
సి. ఆగస్టు 1, 2018 నాడు రిజర్వు బ్యాంకు రెపో రేటును మరియు రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున వరుసగా 6.5% మరియు 6.25% కు పెంచింది .
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు సి
B) సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే
95) మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘం కింది వాటిలో ఒక లక్షణం దృష్ట్యా వెనుకబడిన దేశంను నిర్వచించింది. అది ఏమిటి ?
A) అవస్థాపనా సౌకర్యాలు అధికంగా అభివృద్ధి చెంది ఉండటం మరియు పేదరికం, నిరుద్యోగిత కలిసి ఉండటం
B) అల్ప ఎగుమతులు, అధిక దిగుమతులు కలిసి ఉండటం
C) మానవ వనరుల అనుపయోగిత లేదా అల్ప ఉపయోగితా మరియు శోధింపబడని సహజ వనరులు కలిసి ఉండటం
D) పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కలిసి ఉండటం