6) కింది జతలను పరిశీలించండి :
ఎ. భారత పార్లమెంట్ ఎ సి ఎస్ దురా గతాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం | 1990 |
బి. భారతదేశంలో దళిత పాంథర్స్ ఉద్యమంతో ప్రముఖంగా సంబంధం ఉన్న రాష్ట్రం | మహారాష్ట్ర |
సి. 1956లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏ పార్టీలోకి మార్చబడింది | రిపబ్లికన్ పార్టీ |
డి: భారత ప్రభుత్వం నియమించిన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ | మండల్ కమిషన్ |
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) బి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) ఎ, సి మరియు డి మాత్రమే
7) కింది సంస్థలలో ఏ సంస్థను ఇజ్రాయెల్ వ్యతిరేక పక్షపాత ధోరణి అని ఆరోపిస్తూ యుఎస్ఎ వదిలి వెళ్లగా ఖాళీ అయిన సీటుకు ఐర్లాండ్ 13 జులై 2018 నాడు ఎన్నుకోబడింది ?
A) యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (UNHRC)
B) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
C) ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (IBRD)
D) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
8) కింది జతలను జతపరచండి :
రచయిత | గ్రంథం |
ఎ. విలియం హంటర్ | ఇండియన్ ముసల్మాన్లు |
బి. రాజా రామ్ మోహన్ రాయ్ | గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ (పర్షియన్ భాషలో) |
సి. ఎ.ఎల్.భాషం | ఇండియా ఆఫ్టర్ గాంధీ |
డి. రామచంద్ర గుహ | ద వండర్ దట్ వాజ్ ఇండియా |
సరియైనవి కానీ జతలను ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు డి మాత్రమే
B) బి, సి మరియు డి మాత్రమే
C) సి మరియు డి మాత్రమే
D) ఎ, మరియు బి మాత్రమే
9) అడవి బాపిరాజు గారి ‘గోన గన్నారెడ్డి’ నవల అంకితం గైకొన్న జమిందారు ఎవరు ?
A) జన్నారెడ్డి ప్రతాపరెడ్డి – సూర్యాపేట
B) సూర్యారావు భూపతి – గద్వాల
C) నాయని వెంకట రంగారావు బహద్దూర – నడిగూడెం
D) అక్కినేపల్లి జానకి రామారావు- పాల్వంచ
10) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. గగన్ | 1. శసమాచార ఉపగ్రహం |
బి. జీశాట్ | 2. భూ పరిశీలనా ఉపగ్రహం |
సి. కార్టోశాట్ | 3. మీథేన్ జాడను కనుగొనుటకు |
డి. మంగళయాన్ | 4. దిక్సూచి ఉపగ్రహం |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-4, బి-2, సి-1, డి-3
B) ఎ-4, బి-3, సి-2, డి-1
C) ఎ-3, బి-4, సి-1, డి-2
D) ఎ-4, బి-1, సి-2, డి-3