96) కింది వాటిని జతపరచండి :
వ్యాధి | కారణభూత సూక్ష్మజీవి |
ఎ. కలరా | 1. శీలింధ్రం |
బి. అమ్మోరు | 2. వైరస్ |
సి. మలేరియా | 3. బాక్టీరియా |
డి. గోధుమ పొట్టు | 4. ప్రోటోజోవా |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-2, బి-3, సి-1, డి-4
B) ఎ-3, బి-4, సి-2, డి-1
C) ఎ-3, బి-2, సి-4, డి-1
D) ఎ-4, బి-1, సి-3, డి-2
97) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్
బి. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు
సి. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ‘ప్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ శాఖలో సేవలు అందించిన అధికారి అయి ఉండాలి
డి. సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి మరియు డి మాత్రమే
B) ఎ మరియు బి మాత్రమే
C) ఎ, బి, సి మరియు డి
D) బి, సి మరియు డి మాత్రమే
98) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. చార్టర్ యాక్ట్-1833 | 1. భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం |
బి. భారత ప్రభుత్వం యాక్ట్-1858 | 2. ఫెడరల్ (సమాఖ్య) ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది |
సి. భారత ప్రభుత్వం యాక్ట్-1919 | 3. ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది |
డి. భారత ప్రభుత్వం యాక్ట్-1935 | 4. ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మి నిస్ట్రేషన్ బాడీగా ఏర్పడింది |
A) ఎ-1, బి-2, సి-3, డి-4
B) ఎ-4, బి-3, సి-1, డి-2
C) ఎ-4, బి-3, సి-2, డి-1
D) ఎ-2, బి-1, సి-3, డి-4
99) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డా|| అఘోరనాథ్ చట్టో పాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వాతంత్ర్య పోరాట పితామహుడు పరిగణించబడినాడు
బి. ఆంగ్ల విద్య ప్రారంభం, ఈయన హైదరాబాద్ కళాశాల (తదు పరి నిజాం కళాశాలగా పేరు మార్చబడింది) ప్రథమ ప్రధానా చార్యుడు కావడం, ఈయన చేపట్టిన సాంఘిక సంస్కరణలు, బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మాత్రమే సరియైనది
B) బి మాత్రమే సరియైనది
C) ఎ మరియు బి రెండూ సరియైనవి
D) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
100) భౌగోళిక సూచిక టాగ్ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. భౌగోళిక సూచిక వస్తువుల నమోదు మరియు రక్షణ చట్టం 2004లో తీసుకురాబడింది
బి. 2004-05లో భారతదేశంలో డార్జిలింగ్ టీ భౌగోళిక సూచిక టాగ్ ఇవ్వబడిన మొదటి వస్తువు
సి. భౌగోళిక సూచిక టాగ్ తెలంగాణలోని ఆదిలాబాద్ డోక్రాకు 2016-17లో ఇచ్చారు
డి. ఆదిలాబాద్ డో క్రా అనేది ఒక పురాతన కాలం నాటి బెల్ మెటల్ క్రాఫ్ట్. దీనిని వజరీస్ మరియు అటరిస్ అనబడే వజ్ తెగకు చెందినటువంటి వాళ్లు ఆచరిస్తున్నారు
సరియైనవి కాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) బి మరియు డి మాత్రమే
C) బి మరియు సి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే