101) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు భీమ్ జీ గోండ్
బి. ‘జల్-జంగల్-జమీన్’ అను నినాదాన్ని కుమురం భీమ్ ఇచ్చాడు
సి. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతంలో భీమ్ జీ గోండ్ నాయకత్వంలో గోండులు తిరుగుబాటు చేశారు
సరియైనవి కాని వివరణ (ల)ను ఎంపిక చేయండి :
A) సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు సి మాత్రమే
D) ఎ మరియు బి మాత్రమే
102) కింది జతలను పరిశీలించండి :
పరిశ్రమ ప్రాజెక్ట్ | రాష్ట్రం /ప్రదేశం |
ఎ. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి | 1. కర్ణాటక |
బి. భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమకు ఆది | 2. సూరత్ |
సి. భారతదేశంలో అత్యధిక ముడి మైకా ఉత్పత్తి రాష్ట్రం | 3. ఆంధ్రప్రదేశ్ |
డి. భారతదేశంలో మొట్టమొదటి జనపనార కర్మాగారం ప్రారంభమైన ప్రదేశం | 4. రిష్ణా |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు డి మాత్రమే
B) ఎ, సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే
103) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి
బి. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాథమిక విధుల భాగంలో ఉన్నాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది
104) భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజి ఫెడరల్), ఎందుకంటే :
ఎ. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జిక్యూటివ్ అధికారాల పంపిణీని కల్పిస్తుంది
బి. ఇది ప్రతి రాష్ట్రానికి శాసనసభను మరియు కేంద్రంలో పార్లమెంటును కల్పిస్తుంది
సి. ఇది కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ద్వంద్వ శాసన సభను కలిగి ఉంటుంది
డి. ఇది అధికరణం 3లో సమాఖ్య తరహా రాష్ట్రంగురించి రాజ్యాంగంలో వివరిస్తూ ఇండియా ఒక రాష్ట్రాల సమాఖ్యగా చెప్తుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు డి మాత్రమే
B) బి, సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) ఎ, సి మరియు డి మాత్రమే
105) కింది జతలలో ఏవి సరియైనవి :
ఎ. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది | రాష్ట్ర ఎన్నికల సంఘం |
బి. రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ | రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ |
సి. భారతదేశంలో మొట్టమొదటగా పంచా యతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
సరియైన జతలను ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు బి మాత్రమే