111) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. 7వ షెడ్యూల్ | 1. భూ సంస్కరణలు మరియు రిజర్వేషన్స్ |
బి. 8వ షెడ్యూల్ | 2. ఫిరాయింపు నిరోధక చట్టం |
సి. 9వ షెడ్యూల్ | 3. అధికార విభజన |
డి. 10వ షెడ్యూల్ | 4. పంచాయతీరాజ్ వ్యవస్థ |
5. అధికార భాషలు |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-5, బి-3, సి-4, డి-2
B) ఎ-3, బి-5, సి-1, డి-2
C) ఎ-3, బి-5, సి-1, డి-4
D) ఎ-5, బి-3, సి-1, డి-2
112) కింది వాటిని జతపరచండి :
సంస్థ | అధ్యక్షులు |
ఎ. భావ సమైక్యత ప్రజా సంఘటన | 1. అచ్యుత రెడ్డి |
బి. తెలంగాణ ప్రజా సమితి | 2. శ్రీమతి ఈశ్వరీబాయి |
సి. రిపబ్లికన్ పార్టీ | 3. టి.మదన్ మోహన్ |
డి. తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం | 4. రామానంద తీర్థ |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-1, బి-3, సి-2, డి-4
B) ఎ-4, బి-2, సి-1, డి-3
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-4, బి-3, సి-2, డి-1
113) భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది ?
A) సిహెచ్.హనుమంతరావు కమిటీ
B) జయతి ఘోష్ కమిటీ
C) రోశయ్య కమిటీ
D) కోనేరు రంగారావు కమిటీ
114) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. 18వ ఆసియా క్రీడల (2018)లో రూపిందర్‌పాల్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్
బి. ఈ క్రీడలు 18 ఆగస్టు 2018 నుండి జకర్తా మరియు పాలెంబింగ్ అనే నగరాలలో మొదలయ్యాయి
సి. 18వ ఆసియా క్రీడల ముగింపు ఉత్సవం సెప్టెంబర్ 2, 2018 నాడు జరిగింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే
115) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. అంతర్జాతీయ ద్రవ్య నిధి తన జులై 2018 ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్)లో భారతదేశ వృద్ధి రేటు 2018లో 7.3%గా, 2019లో 7.5% గా ఉంటుందని అంచనా వేసింది.
బి. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (OECD) వారి అభివృద్ధి కేంద్రం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2018-19లో 7.4%గా, 2019-20లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది
సి. జనవరి 2018లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే’ ప్రకారం 2018-19 సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలు 7.0-7.5 శాతం పరిధిలో ఉంటాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే