131) కింది జతలను పరిశీలించండి :
ఎ. రామ్ డియో మిశ్రా – భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు
బి. రాబర్ట్ బ్రౌన్ – సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు
సి. ఆంటోన్ వాన్ ల్యూవెహక్ – కేంద్రకంను ఆవిష్కరించిన వ్యక్తి
డి. న్యూటన్ – సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రం
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే
132) కింద ఇవ్వబడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం ‘ ప్రవేశపెట్టిన సబ్సిడీపై గొర్రెలు పెంచే కుటుంబాలకు గొర్రెల పంపిణీకి సంబంధించినవి :
ఎ. జూన్ 2, 2017 నాడు ఈ స్కీంను ప్రారంభించారు
బి. ఈ పథకాన్ని కొండపాక గ్రామం, సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు
సి. ఈ స్కీంను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు
డి. గొర్రెలకు సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలకు టోల్ ఫ్రీ హెల్ఫ్ లైన్ నెంబర్ 2017
సరియైనవి కాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) బి, సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) బి మరియు డి మాత్రమే
133) కింద ఇచ్చిన సంఘటనలను అవరోహణ క్రమంలో వాటి ప్రారంభం, లేక జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి :
ఎ. కమ్యూనల్ అవార్డ్
బి. మీరట్ కుట్ర కేసు
సి. వైకోం సత్యాగ్రహం
డి. గురవాయూర్ సత్యాగ్రహం
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
A) డి, బి, ఎ, సి
B) సి, బి, డి, ఎ
C) ఎ, సి, బి, డి
D) బి, ఎ, సి, డి
134) ‘బ్రెక్సిట్ కి సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి సరియైనవి ?
ఎ. బ్రెక్సిట్ రెఫరెండం మే 23, 2016 నాడు నిర్వహించబడింది
బి. యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడానికి యునైటెడ్ కింగ్ డం సాధారణ మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకుంది
సి. యునైటెడ్ కింగ్ డం సమయం ప్రకారం మార్చి 29, 2019 నాడు రాత్రి 11 గంటలకు వైదొలగబోతోంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే
135) బర్రెల. పంపిణీ స్కీం గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ఈ స్కీం ‘పాడి రైతులకు బర్రెల పంపిణీ’ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది 2018-19లో ఆచరణ చేయబడుతుంది
బి. అందరు లబ్దిదారులకు యూనిట్ ఖర్చుపైన 50 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది
సి. సుమారు రెండు లక్షల కుటుం:శాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు
డి. రవాణా ఖర్చు రూ. 5,000 కాకుండా ఒక్క బర్రె యూనిట్ ఖర్చు రూ.60,000కు మించకూడదు
సరైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు డి మాత్రమే
B) బి, సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) బి మరియు డి మాత్రమే