TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

141) 2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ‘జనాభా లింగ నిష్పత్తి’ గురించి కింది వివరణలను పరిశీలించండి:
ఎ. తెలంగాణలో 2011లో లింగ నిష్పత్తి 988. అంటే అది స్త్రీలకు అనుకూలంగా లేదని సూచిస్తుంది
బి. జిల్లాల వారీ లైంగిక నిష్పత్తి ప్రకారం, తెలంగాణలోని 11 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది
సి. పదమూడు జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది
డి. 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి మరియు డి మాత్రమే
B) ఎ, బి మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
C) ఎ, బి మరియు డి మాత్రమే

142) జులై 6, 2018నాడు భారత ప్రభుత్వం ‘మదుమలై టైగర్ రిజర్వ్’ (MTR) చుట్టూ 438 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో- సెన్సిటివ్ జోన్ (ESZ)గా ప్రకటించింది. మదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ?

A) కేరళ
B) తమిళనాడు
C) అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు
D) కర్ణాటక

View Answer
B) తమిళనాడు

143) కింది జతలను పరిశీలించండి :
ఎ. 1989 : భారతదేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైన సంవత్సరం
బి. 1909 : భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసిన సంవత్సరం
సి: 32వ అధికరణం : భారత రాజ్యాంగానికి హృదయంగా, ఆత్మగా డా|| బి.ఆర్.అంబేద్కర్ అభివర్ణించిన అధికరణం
సరియైన జత(ల)ను ఎంపిక చేయండి :

A) ఎ, బి మరియు సి
B) సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
D) ఎ మరియు సి మాత్రమే

144) 1789-90 ఫ్రెంచి విప్లవానికి సంబంధించి కింది వివరణలలో (వ్యాఖ్యలలో) సరియైనవి ఏవి ?
ఎ. నిరంకుశ పాలనపై ప్రజాస్వామ్య గెలుపుకు సంకేతం
బి. భూస్వామ్య వ్యవస్థపై పెట్టుబడిదారీ వ్యవస్థ గెలుపుకు సంకేతం
సి. యూరప్ లో పరస్పర రక్షణ కూటముల పెరుగుదలకు దోహదం
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే

View Answer
C) ఎ మరియు బి మాత్రమే

145) హైదరాబాద్ కు చెందిన వర్ధమాన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ 2017 ఐపీఎల్ లో ఏ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు ?

A) కోల్ కతా నైట్ రైడర్స్
B) పూణే వారియర్స్ ఇండియా
C) సన్ రైజర్స్ హైదరాబాద్
D) రాయల్ చాలెంజర్స్ బెంగళూర్

View Answer
C) సన్ రైజర్స్ హైదరాబాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
3 + 29 =