11) అర్థశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్యసేనకు బహూకరించారు. కింది గ్రంథాలలో అమర్త్యసేన్ (ఆంగ్లంలో) రచించినవి ఏవి ?
ఎ. ద ఐడియా ఆఫ్ జస్టిస్
బి. ఎస్సేస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సమ్ రెమినిసెన్సెస్
సి. ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్
డి. ద కంట్రీ ఆఫ్ ఫస్ట్ బోయిస్: అండ్ అదర్ ఎస్సేస్
ఇ వేస్ట్ ఆఫ్ ఏ నేషన్: గ్రోత్ అండ్ గార్బేజ్ ఇన్ ఇండియా
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి మరియు ఇ మాత్రమే
B) బి, సి మరియు ఇ మాత్రమే
C) ఎ, బి, డి మరియు ఇ మాత్రమే
D) ఎ, సి మరియు డి మాత్రమే
12) ‘పెద్ద కరువు’ లేక ‘ధాత కరువు’గా పేరుగాంచి, భారతదేశంలో బ్రిటీష్ పాలనారంభం నుండి అతి భయంకర క్షామంగా పేరు గాంచింది ఏ సంవత్సరంలో సంభవించింది ?
A) 1868-69
B) 1876–78
C) 1770
D) 1790
13) హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్‌సాగర్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు ?
A) 1937
B) 1924
C) 1918
D) 1920
14) కింది వాటిని జతపరచండి :
కరువు రకం | హాని (వల్న-రెబిలిటీ) కారకం |
ఎ. వాతావరణ సంబంధ కరువు | 1. నేల తేమను తక్కువగా కాపాడే సామర్థ్యం |
బి. జల సంబంధ కరువు | 2. పేలవమైన నీటి నిర్వహణ |
సి. వ్యవసాయ సంబంధ కరువు | 3. అటవీ నిర్మూలన |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-1, బి-2, సి-3
B) ఎ-3, బి-1, సి-2
C) ఎ-3, బి-2, సి-1
D) ఎ-2, బి-3, సి-1
15) నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరున్నారు ?
ఎ. మాడపాటి హనుమంతరావు
బి. శ్రీరంగం శ్రీనివాసరావు
సి. రాయప్రోలు సుబ్బారావు
డి. దాశరధి కృష్ణమాచార్య
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) ఎ, బి, సి మరియు డి
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే