146) యంగ్ ఇటలీ ఉద్యమానికి ఇద్దరు విప్లవకారులు సారథ్యం వహించారు. అందులో ఒకరు గారి బాల్డి కాగా మరో విప్లవ కారుడు ఎవరు ?
A) మాకియవెల్లి
B) విక్టర్
C) నెపోలియన్ బోనపార్టీ
D) గుసెప్పె మాజిని
147) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తుతో కడెం నది మీద ఉంది
బి. మల్లెల తీర్థం జలపాతం ప్రాణహిత నదిపై ఉంది
సి. కావేరి నదికి భీమా ఒక ఉపనది
డి. హైదరాబాద్ శివారులో గల వనస్థలిపురం వద్ద గల మహవీర్ వనస్థలి పార్కు జింకలకు ప్రసిద్ధి చెందింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే
148) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. శాసనసభ్యులకు బడ్జెట్ పై చర్చించేందుకు పరిపాలనాంశాల మీద ప్రశ్నించే అధికారం ఇవ్వబడింది | 1. 1935 చట్టం |
బి. మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు | 2. 1892 కౌన్సిళ్ల చట్టం |
సి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం | 3. 1919 చట్టం |
డి. సమాఖ్య ప్రభుత్వం | 4. 1909 చట్టం |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-3, బి-2, సి-4, డి-1
B) ఎ-2, బి-4, సి-3, డి-1
C) ఎ-4, బి-3, సి-2, డి-1
D) ఎ-1, బి-4, సి-3, డి-2
149) కింది రాజ్యాంగ సవరణలను కాలక్రమానుసారంగా అమర్చండి :
ఎ. విద్యావకాశాలలో రిజర్వేషన్ కల్పించే అధికరణం 15(4)ను ప్రవేశపెట్టడం
బి. ప్రమోషన్స్ లో రిజర్వేషన్ కల్పించే అధికరణం 16(44)ను ప్రవేశపెట్టడం
సి. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టడం
డి. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్ జెఎసి)ని ప్రవేశ పెట్టడం
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
A) బి, సి, డి, ఎ
B) డి, సి, ఎ, బి
C) ఎ, బి, సి, డి
D) ఎ, సి, బి, డి
150) భారతమాల ప్రయోజన ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది ?
ఎ. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్డు మరియు రహదారుల ప్రాజెక్ట్
బి. ఇది రాజస్థాన్ మరియు గుజరాతను అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాంను కలుపుతుంది
సి. ఇది జమ్మూ కాశ్మీర్‌ను కేరళతో కలుపుతుంది
డి. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులను అంర్లీనం చేసుకుంటుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి, సి మరియు డి మాత్రమే
B) ఎ, బి మరియు డి మాత్రమే
C) ఎ, సి మరియు డి మాత్రమే
D) ఎ, బి మరియు సి మాత్రమే