16) మిషన్ కాకతీయ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ఇది తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పథకం
బి. సదాశివనగర్ లో మార్చి 12, 2015 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు
సి. ఈ పథకం ద్వారా 46,531 చెరువులను 5 సంవత్సరాలలో పునరుద్ధరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
డి. దీనిని మన ఊరు-మన చెరువు అని కూడా పిలుస్తారు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) ఎ, బి, సి మరియు డి
D) ఎ, సి మరియు డి మాత్రమే
17) భారతదేశ శాస్త్రీయ రంగంలో కింది సంఘటనల కాలక్రమాను సారంగా ఏది సరియైనది ?
ఎ. రోహిణి-1 ఉపగ్రహ ప్రారంభం
బి. పోబ్రాన్ న్యూక్లియర్ పరీక్ష
సి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభం
డి. కల్పకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశకు చేరుకోవడం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి :
A) సి, బి, ఎ, డి
B) డి, ఎ, సి, బి
C) ఎ, బి, డి, సి
D) బి, సి, డి, ఎ
18) ఏఎస్ఎల్వీ ప్రయోగించగల ఉపగ్రహాలు ఏవి ?
ఎ. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు
బి. నక్షత్రాంతర ప్రోబ్స్
సి. సమాచార ఉపగ్రహాలు
డి. దిక్సూచి ఉపగ్రహాలు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి మరియు డి మాత్రమే
B) ఎ, బి, సి మరియు డి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ, బి మరియు సి మాత్రమే
19) భారత ప్రభుత్వంచే జూన్ 2015లో ప్రారంభించబడిన ‘అమృత్’ (AMRUT)పథకంలో కింద ఇచ్చిన తెలంగాణలోని పట్టణాలలో ఏవి చేర్చబడలేదు ?
ఎ. ఆదిలాబాద్
బి. కరీంనగర్
సి. మెదక్
డి. నిజామాబాద్
ఇ. సంగారెడ్డి
ఎఫ్. సూర్యాపేట
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఇ మరియు ఎఫ్ మాత్రమే
B) ఎ, సి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) సి మరియు ఇ మాత్రమే
20) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. ఆనందం యొక్క సిద్ధాంతం | 1. శాసనసభ |
బి. నివారణ పిటిషన్ | 2. సుప్రీంకోర్ట్ |
సి. ప్రివిలేజెస్ | 3. హైకోర్ట్ |
డి. పర్యవేక్షక అధికార పరిధి | 4. ఎగ్జిక్యూటివ్ |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-4, బి-2, సి-1, డి-3
B) ఎ-3, బి-4, సి-1, డి-2
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-2, బి-1, సి-4, డి-3