21) ఎంత ఆర్థిక వ్యయంతో ‘సమీకృత మత్స్య అభివృద్ధి స్కీం’ (IPDS)ను తెలంగాణ .ప్రభుత్వం ప్రారంభించింది ?
A) రూ.1,000 కోట్లు
B) రూ. 15,600 కోట్లు
C) రూ.5,500 కోట్లు
D) రూ.6,800 కోట్లు
22) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. సహాయ నిరాకరణోద్యమం భారతదేశం లోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్ర్య సమరంలోకి తీసుకువచ్చింది
బి. చౌరీ-చౌరాలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది
23) కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరియైనవి ఏవి ?
ఎ. ఇవి అమలు చేయబడలేవు
బి. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు
సి. ఇవి ప్రాథమికంగా నైతిక విధులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే
24) ప్రఖ్యాత కవి గుల్జార్ రచించిన “గ్రీన్ పోయెమ్స్”ను తెలుగులోకి అనువదించినది ఎవరు ?
A) శిఖామణి
B) చల్లపల్లి స్వరూపారాణి
C) వారాల ఆనంద్
D) మంగరి రాజేందర్
25) కింది జతలను పరిశీలించండి :
కర్మాగారం ప్రాజెక్ట్ | ప్రదేశం |
ఎ. ఉకై జల విద్యుత్ ప్రాజెక్టు | రాజస్థాన్ |
బి. కొయలి చమురు శుద్ధి కర్మాగారం | గుజరాత్ |
సి. భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం | తమిళనాడు |
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే