26) తెలుగు మీడియాపై శ్రీకృష్ణ కమిటీ పరిశీలన కింది వాటిలో దేనిని తెలియజేసింది ?
A) తెలుగు ప్రసార మాధ్యమాల యాజమాన్యం మరియు శీర్షికలు రాసేవారు తెలంగాణ వారు
B) తెలుగు ప్రసార మాధ్యమాల యాజమాన్యం మరియు శీర్షికలు రాసేవారు ఆంధ్ర వారు
C) ఒక రెండు చానళ్లలో వాటాలు గలవారు తప్ప మిగిలిన వార్త పత్రికలు సీమాంధ్ర ప్రజల వద్దే ఉన్నాయి
D) తెలంగాణ గురించి చెప్పడంలో తెలుగు ప్రసార మాధ్యమాలు నిష్పాక్షికంగా ఉన్నాయి
27) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. కల్నల్ టాడ్ ‘రాజస్థాన్ ఆనల్స్’ అనే తన గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నాడు
బి. ‘పృధ్వీరాజ్ రాసో’ అనే గ్రంథాన్ని సి.వి.వైద్య రచించాడు
సి. మిహిర భోజుడు ప్రతీహార వంశానికి చెందినవాడు
డి. మొహమ్మద్ ఘోరీ దాడులను చండీల రాజు విద్యాధరుడు ఎదురించలేదు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి, సి మరియు డి మాత్రమే
B) డి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే
28) కింద ఇవ్వబడిన భారతదేశపు అటార్నీ జనరలను కాలక్రమాను సారం అమర్చండి :
ఎ. ముకుల్ రొహతగి
బి. సోలి సొరాబ్లీ
సి. అశోక్ దేశాయి
డి. జి.ఇ.వాహనవతి
ఇ కె.కె.వేణుగోపాల్
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
A) బి, ఇ, సి, ఎ మరియు డి
B) ఇ, ఎ, డి, బి మరియు సి
C) ఎ, సి, డి, బి మరియు ఇ
D) సి, బి, డి, ఎ మరియు ఇ
29) ఆగస్టు 2005లో నియమించబడ్డ రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ యొక్క చైర్ పర్సన్ ఎవరు ?
A) దినేష్ గోస్వామి
B) వీరప్ప మొయిలీ
C) జస్టిస్ కుల్దీప్ సింగ్
D) జస్టిస్ జె.ఎస్.వర్మ
30) శాసన మండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది ?
ఎ. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా
బి. పరోక్ష ఎన్నిక ద్వారా
సి. నియామకం ద్వారా
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు బి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు సి మాత్రమే