66) కిరణ్, సుమన్ ల జీతాలు 4.: 5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇద్దరికీ రూ. 40,000 చొప్పున జీతం పెరిగిన తరువాత వారి జీతాల నిష్పత్తి 5 : 6 అయింది. జీతం పెరిగిన తరువాత సుమన్ యొక్క ప్రస్తుత జీతం ఎంత ?
A) రూ.2,52,000
B) రూ.1,80,000
C) రూ. 2,16,000
D) రూ.2,40,000
67) అజీజ్ ఒక స్కూటర్ని కొంత మొత్తానికి కొని, దానిపై 20% రిపేర్లకు ఖర్చు పెట్టాడు. రిపేరు అయిన తరువాత దాన్ని 30% లాభానికి అమ్మితే, అజీజ్ కు రూ.3,800 లాభం వస్తే, స్కూటర్ రిపేర్లకు అయిన ఖర్చు ఎంత?
A) రూ.2,700
B) రూ.1,800
C) రూ.2,000
D) రూ.2,400
68) కొంత మొత్తాన్ని ఎ, బి, సి, డి లు క్రింద ఇచ్చిన ప్రకారం పంచుకుంటే బి వాటాగా రూ.1,600 వస్తే, డి వాటా ఎంత?
=
A) రూ.3,200
B) రూ.2,000
C) రూ.2,500
D) రూ.3,000
69) 15 మంది రోజుకు 9 గంటల చొప్పున పనిచేసి 32 రోజులలో ఒక పని చేస్తారు. ఎంత మంది రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు?
A) 28
B) 25
C) 26
D) 27
70) నెలసరి విద్యుత్ బిల్లులో కొంత మొత్తం స్థిరంగానూ, మిగతాది వాస్తవంగా వినియోగించిన విద్యుత్తుకు యూనిట్ ధర చొప్పున గణిస్తారు. ఒక నిర్దిష్ట నెలలో 500 యూనిట్ల వినియోగానికి రూ. 2,000, మరొక నెలలో 650 యూనిట్ల వినియోగానికి రూ. 2,450 బిల్లు వచ్చింది. 725 యూనిట్ల విద్యుత్ వినియోగానికి ఎంత బిల్లు వస్తుంది?
A) రూ.2,800
B) రూ.2,678
C) రూ.2,650
D) రూ.2,700