76) ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిన ఒక ఎన్నికలో 12% మంది ఓటర్లు ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 15% ఓట్లు చెల్లలేదు. 10% ఓట్లు ‘నోటా’ కి పడ్డాయి. మిగిలిన ఓట్లలో 60% ఓట్లు పొంది, 2,640 ఓట్లు మెజారిటీతో ఒకతను గెలిస్తే, ఆ ఓటరు జాబితలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు?.
A) 28,000
B) 20,000
C) 24,000
D) 26,400
77) 6(a-b)=216, 6(a+b)=7,776 అయితే b యొక్క విలువ ఎంత?
A) 1
B) 4
C) 3
D) 2
78) కృష్ణయ్య తన ఉద్యోగ విరమణకు సంబంధించి వచ్చిన మొత్తంలో 30% అతని భార్యకు ఇచ్చాడు. మిగిలిన దాంట్లో 20% చొప్పున తన ఇద్దరు పిల్లలకు పంచాడు. ఇంకా మిగిలిన దాంట్లో, 50% ఒక పాఠశాలకు దానం చేశాడు. చివరగా తన దగ్గర రూ.42,000 మిగిలితే, కృష్ణయ్య యొక్క ఉద్యోగ విరమణకు సంబంధించి వచ్చిన మొత్తం ఎంత?
A) రూ.2,20,000
B) రూ.1,80,000
C) రూ.2,00,000
D) రూ.2,10,000
79) రెండు సంఖ్యల మొత్తం 20 మరియు లబ్దం 84 అయితే రెండు సంఖ్యల వర్గాల మొత్తం ఎంత?
A) 250
B) 232
C) 208
D) 202
80) ఎ, బి, సిలు ఒకే దిశలో వృత్తాకారపు ఆటస్థలం చుట్టూ ఒకేసారి, ఒకే స్థానం నుంచి పరిగెత్తడం ప్రారంభించారు. ఒక పరిభ్రమణానికి ఎ, బి, సిలకు క్రమంగా 42, 68, 126 సెకన్లు పడితే వాళ్లు ముగ్గురూ బయలుదేరిన స్థలంలో మళ్లీ ఎంత సమయం తరువాత కలుస్తారు?
A) 72ని. 24 సె. తరువాత
B) 70ని. 24 సె. తరువాత
C) 71ని. 26 సె. తరువాత
D) 71ని. 24 సె. తరువాత