121) కింద ఇచ్చిన ప్రశ్నలు ఒక ప్రకటనని, రెండు ఊహలను I,II కలిగి ఉన్నాయి.
కింద ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: పిల్లలను 5 సంవత్సరాల వయస్సులో పాఠశాలలో చేర్పించడం వాంఛనీయం.
భావనలు:
I.ఆ వయస్సులో పిల్లవాడు కావల్సినంత అభివృద్ధి చెంది, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
II.ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలను, పాఠశాలలు చేర్చుకోవు.
A) I భావన మరియు II భావన నిస్సందేహమైనవి.
B) I భావన మాత్రమే నిస్సందేహమైనది.
C) II భావన మాత్రమే నిస్సందేహమైనది.
D) I భావన లేదా II భావన నిస్సందేహమైనది.
122) కింద ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు వాదనలు, I, II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: భారతదేశంలో ప్రజా సరఫరా వ్యవస్థని రద్దు చేయొచ్చా?
వాదనలు:
I.అవును. రక్షణా విధానం ముగిసింది. ప్రతి ఒక్కరూ వారి’ ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి.
II.అవును. లంచగొండితనం వలన పేద వారు ఏమీ పొందడం లేదు.
A) I వాదన, II వాదనలు బలమైనవి కావు.
B) I వాదన మాత్రమే బలమైంది.
C) II వాదన మాత్రమే బలమైంది.
D) I వాదన లేదా IIవాదన బలమైంది.
123) కింద ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు వాదనలు, I,II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన : రాజకీయ నాయకులను కిడ్నాప్ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం సరైన చర్యేనా?
వాదనలు :
I.అవును. బాధితలను ఎంత ఖర్చు పెట్టి అయినా రక్షించుకోవాలి.
II.కాదు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చర్యలు చేయడానికి కిడ్నాపర్లను ప్రోత్సహించినట్లు అవుతుంది.
A) I వాదన, II వాదనలు బలమైనవి.
B) I వాదన మాత్రమే బలమైంది.
C) II వాదన మాత్రమే బలమైంది.
D) I వాదన, II వాదనలు బలమైనవి కావు.
124) కింద ఇవ్వబడిన రెండు ప్రవచనాల్లో ఒకటి ప్రతిపాదన (A) ,మరొకటి కారణం (R).
ఇవి సరైనవి కావచ్చు. తప్పు కావచ్చు.
కింద ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి.
ప్రతిపాదన (A) : భారతదేశం ప్రజాస్వామిక దేశంగా పేరుగాంచింది.
కారణం (R): భారతదేశం తన స్వంత రాజ్యాంగం కలిగి ఉంది.
A) (A) సరైనది కాదు, (R) సరైనది.
B) (A) ,(R) లు రెండూ సరైనవి మరియు (R),(A) కు సరైన వివరణ.
C) (A) ,(R)లు రెండూ సరైనవి కానీ, మరియు (R),(A)కు సరైన వివరణ కాదు.
D) (A) సరైనది, (R) సరైనది కాదు.
125) కింద ఇవ్వబడిన రెండు ప్రవచనాల్లో ఒకటి ‘ప్రతిపాదన (A) ,మరొకటి కారణం (R).ఇవి సరైనవి కావచ్చు, తప్పు కావచ్చు.
కింద ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి.
ప్రతిపాదన (A) : జీవితానికి నీరు నిత్యావసరం
కారణం (R) : అది, మూడు భాగాల హైడ్రోజన్, ఒక భాగం ఆక్సిజన్ ద్వారా నిర్మితమైనది.
A) (A) సరైనది కాదు, (R) సరైనది.
B) (A) ,(R) లు రెండూ సరైనవి మరియు (R),(A) కు సరైన వివరణ.
C) (A) ,(R)లు రెండూ సరైనవి కానీ, మరియు (R),(A) కు సరైన వివరణ కాదు.
D) (A) సరైనది, (R) సరైనది కాదు.