31) ఒక నది పడమర నుండి తూర్పు వైపుకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ఎడమ వైపుకు తిరిగి కొంత దూరం ప్రయాణించిన తరువాత, ఒక గుడి చుట్టూ అర్థ వృత్తాకారంలో ప్రయాణించి. చివరగా లంబకోణంతో ఎడమ వైపుకు తిరిగింది. చివరిగా నది ఏ దిశలో ప్రయాణిస్తుంది?
A) దక్షిణం
B) తూర్పు
C) పడమర
D) ఉత్తరం
32) ఒక ప్రదేశం నుండి బయలుదేరి ఒక వ్యక్తి తూర్పు దిశలో 1km నడిచిన తరువాత, దక్షిణం వైపుకు తిరిగి 5 కి.మీ. నడిచాడు. ఆ తరువాత అతను తూర్పు వైపుకు తిరిగి 2 km నడిచాడు. ఆ తరువాత అతను ఉత్తరం వైపుకు తిరిగి 9 km నడిచాడు. అతను ఇప్పుడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?
A) 6 km
B) 3 km
C) 4 km
D) 5 km
33) ఓడో మీటర్ వేగానికి సంబంధిస్తే ‘కంపాస్’ దేనికి సంబంధించింది?
A) డైరెక్షన్ (దిశ)
B) రాడార్
C) హైకింగ్ (పెరుగుదల)
D) నీడిల్ (ముల్లు)
34) క్రింది వాటిలో భిన్నంగా ఉంది ఏది?
A) PRUY
B) MORV
C) HJMQ
D) RTWZ
35) ఒక కొలనులో 1వ అంకె నుండి 10వ అంకె వరకు గుర్తింపబడిన 10 మెట్లు కలవు. ఒక కప్ప ప్రతి నిమిషానికి అది ఉన్న మెట్టు నుండి నాలుగు మెట్లు పైకి దూకుతుంది. ఉదాహరణకు 1 నుండి 5వ మెట్టుకి, 5 నుండి 9వ మెట్టుకి, 9 నుండి 3వ మెట్టుకి దూకుతుంది. 1వ మెట్టు నుండి మొదలు పెడితే ఆ కప్ప 60వ నిమిషంలో ఎన్నో మెట్టు మీద ఉంటుంది?
A) 8
B) 1
C) 3
D) 5