51. ఒక ఆదర్శ డయోడ్ కు ఫార్వర్డ్ బయాస్ మరియు రివర్స్ బయాస్ నందు వరుసగా ___________ కల్గివుండును.
(A) సున్న కండెక్టన్స్ మరియు సున్న నిరోధము
(B) సున్న కండెక్టన్స్ మరియు అనంత నిరోధము
(C) అనంత కండెక్టన్స్ మరియు అనంత నిరోధము
(D) అనంత కండెక్టన్స్ మరియు సున్న నిరోధము
52. ఈ క్రింది వానిలో తప్పుగా చెప్పబడిన ప్రతిపాదనను గుర్తించండి :
(A) ఫ్యూజ్ ను ఒక వ్యవస్థ ఓవర్ లోడ్ లో వున్నప్పుడు, వ్యవస్థను సురక్షితంగా వుంచుటకు వాడెదరు.
(B) ఎలక్ట్రోలైట్ లో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనుటకు ఓమ్ నియమాన్ని ఉపయోగిస్తారు.
(C) కిర్చాఫ్స్ కరెంట్ నియమము విద్యుత్ ఆవేశ పరిరక్షణ నియమము నుండి ఉద్భవించింది.
(D) కిర్ఛాఫ్స్ ఓల్టేజి నియమము శక్తి పరిరక్షణ నియమము నుండి ఉద్భవించింది.
53. హర్టెలీ ఆసిలేటర్ ఒక :
(A) ఫేజ్-షిఫ్ట్ ఆసిలేటర్
(C) క్రిస్టల్ ఆసిలేటర్
(B) ఆర్.సి. ఆసిలేటర్
(D) ఎల్.సి. ఆసిలేటర్
54. పలకలు కల్గిన లెడ్ ఆసిడ్ బ్యాటరిలో ఎన్ని ఋణాత్మక పలకలుంటాయి ?
(A) 9
(B) 8
(C) 7
(D) 10
55. ఈ క్రింది వానిలో ఏది ఉత్సర్గ దీపం కాదు ?
(A) మెర్క్యూరీ వేపర్ ల్యాంప్
(B) సోడియం వేపర్ ల్యాంప్
(C) నియాన్ ల్యాంప్
(D) ఇనిక్యాండిసెంట్ ల్యాంప్