11. ఈ క్రింది వానిలో ఏ వ్యవస్థను పవర్ మరియు లైటింగ్ లోడ్ కొరకు ఉపయోగిస్తారు ?
(A) 3-ఫేజ్, 4-వైర్
(B) 3-ఫేజ్, 3-వైర్
(C) 1-ఫేజ్, 2-వైర్
(D) 1-ఫేజ్, 3-వైర్
12. ఒక 3-ఫేజ్ ఇండక్షన్ మోటారును సింక్రనస్ స్పీడ్ దగ్గర త్రిప్పినచో దాని యొక్క టార్క్ మరియు స్లిప్ వరుసగా :
(A) గరిష్ఠం మరియు ఒకటి
(B) గరిష్ఠం మరియు సున్న
(C) సున్న మరియు ఒకటి ఇండం
(D) సున్న మరియు సున్న
13. ఒక సైన్ తరంగము యొక్క గరిష్ట విలువ 10 π అయినచో ఒక సంపూర్ణ వలయములో దాని సరాసరి విలువ ఎంత ?
(A) 10
(B) zero
(C) 20
(D) 6.37
14. ఒక విద్యుత్ వాహకము యొక్క ఉపరితలము మీదకు కేంద్రీకరించు ఏకాంతర ప్రవాహపు ధోరణిని ఏమంటారు ?
(A) ఫెర్రాంటీ ప్రభావం
(B) కరోనా
(C) ప్రాక్సిమిటీ ప్రభావం
(D) స్కిన్ ప్రభావం
15. ఈ క్రింది రెండు ప్రతిపాదనలును పరిగణలోకి తీసికొనినచో :
(I) రెక్టిఫైర్ ఎ.సి. సప్లైను డి.సి. సప్లగా మార్చును.
(II) ఇన్వర్టర్ డి.సి. సప్లైను ఎ.సి. సప్లగా మార్చును.
(A) రెండు ప్రతిపాదనలు (I) మరియు (II) తప్పు
(B) రెండు ప్రతిపాదనలు (I) మరియు (II) ఒప్పు
(C) (I) ప్రతిపాదన ఒప్పు కాని (II) ప్రతిపాదన తప్పు
(D) (1) ప్రతిపాదన తప్పు కాని (II) ప్రతిపాదన ఒప్పు